ఉప్పు మహిళ

ఆఫ్రికన్ దేశం సెనెగల్ లోని ఫాటిక్ పట్టణం. టౌన్ చుట్టూ చిన్న చిన్న ఉప్పు నీటి సరస్సులు ఈ నీళ్లతో ఉప్పును ప్రభుత్వమే తయారు చేసేది. నిర్వహణ కష్టతరం కావడంతో స్టాల్ ప్లాట్ ల ఏర్పాటుకు సన్నాకారు రైతులకు సెనగల్ ప్రభుత్వం అనుమతిచ్చింది. రైతులు పంటలకు బదులు నీటిని పొలం మడుగుల్లోకి తరలించి.. ఎండకు ఆ నీళ్లు ఆవిరయ్యాక ఉప్పును సేకరిస్తారు.కానీ, ఇది ఎంతో కష్టం తో కూడుకున్నపని. ఓపిక చాలా అవసరం. అందుకే ఎక్కువ మంది ఈ వ్యాపారంపై ఆసక్తి చూపట్లేదు. ముప్పై ఐదేళ్ల మరియా మాత్రం ఈ వ్యాపారంలో అడుగుపెట్టాలనుకుంది. అప్పటికే ఆమె భర్త కొన్ని వ్యాపారాలు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. తన చేతిలో ఉన్న కొద్ది డబ్బుతో గతేడాది చివర్లో ఆమె బిజినెస్‌ ప్రారంభించింది.

కోటిన్నర జనాభా ఉన్న సెనెలియాలో మహిళలకు భూమిపై హక్కు ఉండేదికాదు. మగవాళ్లతో సమాన హక్కుల కోసం పలు మహిళా సంఘాలు పోరాడాయి. ఈపోరాటంలో మరియా కూడా చేతులు కలిపింది. ఏదైతేనేం 2018లో ఆ నిబంధనను ఎత్తేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసిం ది. ఆ తర్వాత ‘సాల్ట్‌‌ ప్లాట్‌ ’ల నిర్వాహణకు మరియాకు అధికారుల నుంచి అనుమతి లభించలేదు.ఆ హక్కు మగవాళ్లకేనా అని ప్రశ్నిస్తూ న్యాయ పోరాటం చేసిందామె. చివరకు విజయం సాధిం చి ‘సాల్ట్ ప్లాట్‌ ’ బిజినెస్ మొదలుపెట్టింది. దేశంలో ఈ వ్యాపారం ప్రారంభించిన మొదటి మహిళగా మరియా ఘనత సాధించింది.

యూనిసెఫ్‌ గణాంకాల ప్రకారం ప్రతీ ఏటా 19మిలియన్ల చిన్నారులు అయోడిన్‌ లోపంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో ఏటా నాలుగున్నర లక్షల టన్నుల ఉప్పు సెనెగల్‌ నుం చే ఉత్పత్తి అవుతోంది. అయితే అది ‘అయోడైజ్డ్‌‌’ ఉప్పు మాత్రం కాదు. చాలా మంది రైతుల్లో అవగాహన లేకపోవడంతో సాధారణ ఉప్పునే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించింది మరియా. అయోడైజ్‌‌ ప్రక్రియలో ఉప్పును తయారు చేయిస్తోంది.ఫాటిక్‌ లో ఇప్పుడామె నెం బర్‌ వన్‌ ఉప్పు

వ్యాపారి. లాభాలు అర్జించడంతో పాటు నలుగురికి ఉపాధి ఇస్తోంది. ఆమె స్ఫూర్తితో గ్వురెన్‌ అనే మహిళ కూడా ఈ మధ్యే వ్యాపారం మొదలు పెట్టింది.‘మరియాను మేం ‘సాల్ట్‌‌ క్వీన్‌ ’ అని పిలుచుకుంటాం. ఆమె తన కుటుంబం గురించి మాత్రమే కాదు. దేశం గురిం చి ఆలోచిస్తోంది. నాకు ఆమె ఆదర్శం’ అంటోంది గ్వు రెన్‌ .

Latest Updates