ఈ నాన్నకి సెల్యూట్‌‌‌‌

ఒకవైపు జాబ్‌‌‌‌, మరోవైపు ఇంటి బాధ్యతలు. ఈ రెండింటిని బ్యాలెన్స్‌‌‌‌ చేసుకోవడంలో ఉన్న తలనొప్పి మాములుది కాదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ల బాగోగులు చూసుకోవడం అదనపు బాధ్యత. అయితే  పిల్లల్ని వెంటపెట్టుకుని మరీ డ్యూటీని సక్రమంగా నిర్వహించే లేడీ ఆఫీసర్లను చూశాం. వాళ్ల డెడికేషన్‌‌‌‌కి  హ్యాట్సాఫ్‌‌‌‌ చెప్పుకున్నాం. కానీ, అలాంటి కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌ని చూపించి సోషల్ మీడియాలో రియల్ స్టార్‌‌‌‌ అనిపించుకుంటున్నాడు ఒక తండ్రి.

అశుతోష్‌‌‌‌ హర్బోలా, నొయిడా(ఢిల్లీ)లో ఒక మార్కెటింగ్‌‌‌‌ కంపెనీకి సీఈవో. కూతురు శ్లోకా అంటే ప్రాణం అతనికి. అందుకే ఆఫీస్‌‌‌‌కి కూడా వెంటపెట్టుకుని వస్తున్నాడు. ఆ పాప కేరింగ్‌‌‌‌ మొత్తం అశుతోషే చూసుకుంటున్నాడు. ఈమధ్య ఒకరోజు పాపకి ఫీడింగ్‌‌‌‌ చేస్తున్న టైంలో అదే ఆఫీస్‌‌‌‌లో పని చేసే దుశ్యంత్‌‌‌‌ సింగ్‌‌‌‌  ఫొటో తీశాడు. ఆ ఫొటోను తన ట్విట్టర్‌‌‌‌లో షేర్‌‌‌‌ చేశాడు దుశ్యంత్‌‌‌‌. ఈ ఫొటో ఒక్కపూటలో  వైరల్‌‌‌‌ అయ్యింది. రీట్వీట్లు, లైకులతో నెటిజన్స్‌‌‌‌ మధ్య ఇంట్రెస్టింగ్‌‌‌‌ కన్వర్‌‌‌‌జేషన్‌‌‌‌కి దారితీసింది. ఒకవైపు పని.. మరోవైపు పాప బాగోగులు చూసుకుంటున్న దుశ్యంత్‌‌‌‌కి హ్యాట్సాఫ్‌‌‌‌ చెబుతున్నారు పలువురు నెటిజన్స్‌‌‌‌.

 

Latest Updates