“సామజవరగమన” పేరడి…నెట్టింట్లో వైరల్

నీ కళ్లకు కాస్తా కావాలి కాస్తా..నీభవిష్యత్ పై కలలు. నీ సమయం అంతా వృధా చేస్తే ఉండదు ఫ్యూచర్. ఏంటని అనుకుంటున్నారా..? అల్లుఅర్జున్ హీరోగా, మాటల మాంత్రికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో వచ్చిన

“అల.. వైకుంఠపురం”  లోని ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో మనందరికి తెలిసిందే. “సామజవరగమన” అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు.  సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం , సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడడంపై విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఏ ఎంటర్ టైన్మెంట్ ఫోగ్రాం జరిగినా ఈ సాంగే వినబడుతోంది. ఈ పాట అన్నీ వర్గాల ఆడియన్స్ అలరించడమే కాదు..స్కూల్ టీచర్లు సైతం ఈ పాటకు ఫిదా అవుతున్నారు.

నీకళ్లకు  కావాలి కాస్తా..నీభవిష్యత్ పై కలలు అంటూ ఓ స్కూల్ టీచర్ సామజవరగమన సాంగ్ పై పేరడి రాశారు. ఇప్పుడా పేరడి సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు అనుకున్న లక్ష్యాల్ని సాధించాలని అర్ధం వచ్చేలా పాటను ఆలపించారు.

Latest Updates