ఆజంఖాన్‌‌పై బర్రె దొంగతనం కేసు

రామ్‌‌పూర్‌‌‌‌: సమాజ్‌‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌‌పై మరో ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఫైలైంది. 2016 అక్టోబర్‌‌‌‌లో ఆజంఖాన్‌‌, ఆయన అనుచరులు తమ ఇంట్లోకి చొరబడి బర్రెను, రూ.25వేలు నగదును ఎత్తుకెళ్లారని రామ్‌‌పూర్‌‌‌‌కు చెందిన అసీఫ్‌‌, జకీర్‌‌‌‌లు ఆయనపై కేసు పెట్టారు. స్కూల్‌‌ బిల్డింగ్‌‌ కట్టేందుకు తాము ఉంటున్న ఇంటిని, ల్యాండ్‌‌ను రాసివ్వాలని బెదిరించారని ఆరోపించారు. దీనిపై అప్పటి సర్కిల్‌‌ ఆఫీసర్‌‌‌‌ హసన్‌‌, మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని  పోలీసులు చెప్పారు. ఇప్పటికే చాలా కేసుల్లో నిందితుడైన ఆజం ఖాన్‌‌కు కోర్టు నాన్‌‌ బెయిలబుల్‌‌ వారెంటు జారీ చేసింది.

 

Latest Updates