శర్వానంద్, సమంత జంటగా ’96’ రీమేక్

పెళ్లి తరువాత ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది అక్కినేని సమంత. ఈ మధ్య రిలీజ్ అయిన ‘మజిలీ’ లో నటనపరంగా మార్కులు కొట్టేసింది. మంచి పాత్ర ఉంటే చాలు.. పెద్ద హీరో చిన్న హీరో అనే తేడాలేకుండ సినిమాకు ఓకే చెప్పేస్తుంది.  తమిళంలో హిట్ అయిన ’96’సినిమా తెలుగులో రీమేక్ అవుతుంది. ఈ సినిమాకు సమంత ఓకే చెప్పింది. ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా… సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘జాను’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. తమిళంలో 96గా వచ్చిన ఈ మూవీలో… త్రిశ, విజయ్ సేతుపతి జంటగా నటించారు.

హీరో శర్వానంద్ ప్రస్తుతం సుదీప్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అవగానే శర్వా-సమంత జంటగా మూవీ తెరకెక్కనుంది. ‘జాను’ సినిమాకు చెందిన పూజా కార్యక్రమం పూర్తి అయింది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

Latest Updates