ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ ను లాంచ్ చేసిన సమంత : టిక్ టాక్ తరహాలో వీడియోస్ ఎలా చేయాలంటే

ఇన్ స్టాగ్రామ్ తన కొత్త ఫీచర్స్ ఇన్ స్టాగ్రామ్ రీల్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. హైదరాబాద్‌ లో ఇన్ స్టాగ్రామ్ ఫీచర్ ను అక్కినేని సమంత, ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ స్టా ప్రతినిధులు మాట్లాడుతూ వీడియో ఫార్మాట్ ను ఇండియాలో పెద్ద ఎత్తున ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటే

చైనా కు చెందిన టిక్ టాక్ యాప్ బ్యాన్ కావడంతో నెటిజన్లను ఆకర్షించేందుకు స్వదేశానికి చెందిన పలు టెక్ కంపెనీలు టిక్ టాక్ తరహాలో యాప్ ను డిజైన్ చేసి అందుబాటులోకి తెచ్చాయి. వాటితో పాటు ఫేస్ బుక్ లాంటి ప్రముఖ నెట్ వర్కింగ్ సైట్లు సైతం ఈ ఎంటర్ టైన్ మెంట్ యాప్ ను డిజైన్ చేశాయి. ఇందులో భాగంగా ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టా గ్రామ్..ఇన్ స్టాగ్రామ్స్ రీల్స్ పేరుతో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫీచర్ ను వినియోగించుకొని టిక్ టాక్ తరహాలో వీడియోలు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పొందాలంటే ప్లేస్టోర్ లో చెక్ చేసుకోవాలి.

టిక్ టాక్ తరహాలో ఇన్ స్టా గ్రామ్ రీల్ లో వీడియోలు ఎలా చేయాలంటే  

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాగ్రామ్ ను ఇన్ స్టాల్ చేసుకొని రీల్స్ ఫీచర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అనంతరం ఇన్ స్టాగ్రామ్ డాష్ బోర్డ్ లో ఉన్న కెమెరా ఆప్షన్ ను చెక్ క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ లో టిక్ టాక్ లా లైవ్, స్టోరీ, రీల్స్ అనే మరిన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. రీల్స్ ఆప్షన్ ను క్లిక్ చేసి 15సెకెన్ల టైం డ్యూరేషన్ ఉన్న వీడియోల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సినిమా క్లిప్స్ ను యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ తో పాటు వీడియోను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు  ఫేస్‌బుక్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ మోహన్‌ తెలిపారు. ఈ సందర్భంగా అజిత్ మోహన్ మాట్లాడుతూ ఇన్ స్టా గ్రామ్ లో ప్రతీ నెల 50 శాతం మంది కొత్త యూజర్స్ పెరుగుతున్నారని, ఆ యూజర్స్ అందరూ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ను ఉపయోగించుకునేలా ఆకర్షిస్తుందని అన్నారు.  దేశవ్యాప్తంగా వీడియో వినియోగం పెరగడంతో పాటు ఇండియాలో సోషల్ మీడియా నెట్ వర్క్ లలో  మూడవ వంతు పోస్ట్‌లు వీడియోలే కావడంతో ఇన్‌ స్టాగ్రామ్‌ కీ రోల్ ప్లే చేసేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. మన దేశానికి చెందిన నెటిజన్లు ఇన్ స్టాగ్రామ్ ను యూజ్ చేసేందుకునేందు ఉత్సాహాం చూపించడంతో పాటు తమ టాలెంట్ తో మరింత ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నట్లు అజిత్ మోహన్ చెప్పారు.

Latest Updates