మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సమంత

‘హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’ జాబితాలో హీరోయిన్ అక్కినేని సమంత నెంబర్ వన్ ర్యాంక్ ను దక్కించుకున్నారు. హైదరాబాద్ టైమ్స్ సంస్థ ప్రతీ సంవత్సరం వివిధ రంగాలకు చెందిన 40ఏళ్ల లోపు ఉన్న మహిళలకు కాంటెస్ట్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహించి.. ఆ ఓటింగ్ లో ప్రథమ స్థానం దక్కించుకున్న మహిళలకు అవార్డ్ ను ప్రజెంట్ చేస్తారు.

అందం, అభినయం, ప్రతిభ ఆధారంగా నిర్వహించిన  ఆన్ లైన్ ఓటింగ్ లో సమంత చోటు దక్కించుకున్నారు. పెళ్లి తర్వాత ‘ఓ బేబీ’ మరియు మజిలి సినిమాల్లో యాక్ట్ చేసి హిట్ కొట్టింది. ఇప్పటికి కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ ‘హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019’ టైటిల్ గెలుచుకుంది.

సమంత పెళ్లి తరువాత వచ్చిన రంగస్థలం, మహానటి, యూటర్న్, సూపర్ డీలక్స్, మజిలి, ఓ బేబీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. దీంతో పాటు ఆఫ్ స్క్రీన్, ఫ్యాషన్ తో అభిమానుల్ని పెంచుకుంటూ వెళ్తున్న సమంత హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 అవార్డ్‌ను సొంతం చేసుకోవడంలో హెల్ప్ అయింది

సంతోషం వ్యక్తం చేసిన సమంత

తొలిసారి హైదరాబాద్  టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ – 2019 టైటిల్ గెలుచుకోవడంపై సమంత సంతోషం వ్యక్తం చేశారు. అవార్డ్ ను గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. వివాహం తరువాత ఈ టైటిల్‌ను గెలుచుకోవడం పెద్ద విశేషం. వైవాహిక జీవితంలో ఉన్నప్పుడు ఈ అవార్డ్ ను దక్కించుకోవడం సాధారణ విషయం కాదని సమంత ఆనందం వ్యక్తం చేశారు.

Latest Updates