రివ్యూ: ఓ బేబీ

samantha-oh-baby-movie-reveiw

రివ్యూ: ఓ బేబి

రన్ టైమ్: 2 గంటల 40 నిమిషాలు

నటీనటులు: సమంత, లక్ష్మీ, నాగ శౌర్య రాజేంద్రప్రసాద్,రాజేంద్ర ప్రసాద్,తేజ సజ్జ,ప్రగతి తదితరులు

సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్

మ్యూజిక్: మిక్కీ.జె.మేయర్

మాటలు : లక్ష్మీ భూపాల

నిర్మాతలు: సురేష్ బాబు,విశ్వప్రసాద్,సునీత తాటి,హ్యున్ వో థామస్

దర్శకత్వం: నందినీ రెడ్డి

రిలీజ్ డేట్: జులై 5,2019

కథేంటి?

70 ఏళ్ల బేబి (లక్ష్మీ) చాదస్తాన్ని,నస,గడుసు తనానికి ఇంటా,బయట అందరూ ఇబ్బంది పడుతుంటారు..కోడలు (ప్రగతి) కు ఆమె వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది.డాక్టర్లు ఆమెను దూరంగా ఉంచాలని చెప్తారు.వాళ్ల ఇబ్బందిని గమనించి బాధతో బయటకు వెళ్తుంది బేబి.చిన్నప్పటి నుంచి కష్టాలనుభవించి ఇంత చేసినా..సుఖంగా లేనని దేవుడిని తిట్టుకుంటుంది.. తన బాధ గమనించి దేవుడు తనను 25 ఏళ్ల అమ్మాయిగా మార్చేసి ఎంజాయ్ చేయమని అవకాశం ఇస్తాడు.అప్పుడు ఆమె ఎలాంటి సౌఖ్యాలు అనుభవించింది.?తన వాళ్లను ఆ రూపంలో ఎలా కలుసుకుంది.చివరకు అలాగే ఉందా లేదా.?

నటీనటుల పర్ఫార్మెన్స్:

సమంత తన పర్ఫార్మెన్స్ తో మరోసారి కట్టిపడేసింది. 70 ఏళ్ల బామ్మ లాగా అటిట్యూడ్ చూపించడం,డైలాగ్ డెలివరీ లు..వీటన్నిటీతో తను పండించిన కామెడీ సూపర్బ్.తన కెరీర్ లో మరో మైలురాయి అని చెప్పొచ్చు.సీనియర్ నటి లక్ష్మీ గారు బామ్మ పాత్రలో అదరగొట్టారు.చాలా న్యాచురల్ గా నటించి మెప్పించారు.రావు రమేష్ మరోసారి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో రెండు సీన్లల్లో కంటతడి పెట్టించాడు.మరో మంచి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ రాణించారు. మరో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లో నాగ శౌర్య బాగచేశాడు. ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ ఆకట్టుకున్నాడు.

టెక్నికల్ వర్క్:

రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందంగా ఉంది.మిక్కీ.జె.మేయర్ మ్యూజిక్ బాగలేదు.ఒక్క పాట తప్ప మిగతావి ఆకట్టుకోవు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదు. ఎడిటింగ్ లో లోపాలున్నాయి.కొన్ని సీన్లకు కత్తెరపడాల్సింది.సెకండాఫ్ లో ల్యాగ్ ఉంది.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.లక్ష్మీ భూపాల మాటలు ఆకట్టుకున్నాయి.

విశ్లేషణ:

‘ఓ బేబి’’ మంచి ఎమోషన్ తో కూడిన ఫన్ ఎంటర్ టైనర్.. కొరియన్ మూవీ ‘‘మిస్ గ్రానీ’’ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ మేజర్ పార్ట్ వరకు మెప్పించిందనే చెప్పాలి.అందిరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ పాయింట్.సినిమాలో ఫన్,నటీనటుల పర్ఫార్మెన్స్ చక్కగా కుదిరాయి.ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ మైనస్ పాయింట్స్ ను కవర్ చేశాయి.తద్వారా ‘‘ఓ బేబి’’ అలరిస్తుంది.స్టార్ట్ అయిన 15 నిమిషాలు లక్ష్మీ తన నటనతో కథలోకి ఆడియన్స్ ను తీసుకెళ్తుంది.ఆ తర్వాత సమంత కట్టిపడేస్తుంది.సినిమా మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించిందని చెప్పాలి.డైరెక్టర్ నందినీ రెడ్డి ఎమోషనల్ సీన్లను బాగా తెరకెక్కించారు కానీ సెకండాఫ్ లో కొన్ని అనసవరమైన లాగ్ లు పెట్టి బోర్ కొట్టించారు.ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ లో ఊపులేదు.అక్కడ నీరసంగా అనిపిస్తుంది.నాగ శౌర్య ఎపిసోడ్ కూడా కనెక్ట్ అవ్వదు. మళ్లీ క్లైమాక్స్ లో రావు రమేష్ ఓ ఎమోషనల్ సీన్ తో రక్తి కట్టించాడు.ఓవరాల్ గా ‘‘ఓ బేబి’’ ఓ సారి చూడొచ్చు.