రానా, మిహీకాల రోకా ఈవెంట్ ఫొటోలు పోస్ట్ చేసిన సమంత

హైదరాబాద్: టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్ లు పాల్గొన్న రోకా వేడుక ఫొటోలు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. శుక్రవారం రానా, మిహీకాల కుటుంబ సభ్యులు కలుసుకొని భళ్లాలదేవుడి ఎంగేజ్ మెంట్, పెళ్లి గురించి డిస్కస్ చేశారు. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య, సమంత కూడా హాజరయ్యారు.

రామానాయుడు ఫిల్మ్ స్టూడియోలోని రామానాయుడు మెమోరియల్ లో రోకా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలసి దిగిన ఫొటోలను సమంత తన ఇస్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఈ ఏడాదిలో బెస్ట్ న్యూస్ తెచ్చినందుకు రానా, మిహీకాలకు కృతజ్ఞతలు అనే క్యాప్షన్ ను ఆ పోస్ట్ కు జత చేసింది. అలాగే నాగ చైతన్య నవ్వుతూ కనిపిస్తున్న మరో ఫొటోను కూడా సామ్ పోస్ట్ చేసింది. ‘నా భర్త చాలా అందంగా కనిపిస్తున్నారా.. లేదా? అంటూ ఆ పోస్ట్ కు క్యాప్షన్ ను యాడ్ చేసింది. ఈ ఫొటోలకు ట్విట్టర్ లో చాలా లైక్ లు వస్తున్నాయి.

Latest Updates