చైతూ ఫ్యాన్స్ పై సామ్ ఫైర్

 చైతూ ఫ్యాన్స్ పై సామ్ ఫైర్

టాలీవుడ్ లో బెస్ట్  కపూల్ గా ఓ వెలుగు వెలిగిన అక్కి నేని నాగచైతన్య, సమంతలు విడిపోతారని ఎవరూ కూడా ఊహించలేదు. వీరి విడాకులు అందరిని  షాక్ కి గురిచేశాయి. విడాకుల తర్వాత సమంతను టార్గెట్ చేస్తూ నెటిజన్లు వీపరీతంగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా సామ్ పై రూమర్స్ కూడా బాగానే  వచ్చాయి.  తాజాగా హీరోయిన్ శోభితా ధూళిపాళతో,  నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నాడంటూ ఓ న్యూస్  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీనిపైన ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ చైతన్య ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఆ వార్తల‌ను స‌మంత పి.ఆర్ టీమ్ క్రియేట్ చేసిందంటూ ట్వీట్ చేయడంతో  చైతూ ఫ్యాన్స్ సామ్ ను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. దీనితో సామ్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. ''అమ్మాయిపై రూమర్స్ వస్తే కచ్చితంగా నిజమేనంటారు. అబ్బాయిపై రూమర్స్ వస్తే మాత్రం అమ్మాయి వాటిని క్రియేట్ చేసిందంటారు. ఎదగాల్సిన అవసరం ఉంది. మీరు ప్రస్తావించిన వ్యక్తులు ముందుకెళ్లిపోతున్నారు. మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ పని, ఫ్యామిలీ మీద కాన్‌సన్ ట్రేషన్ చేయండి. ముందుకు వెళ్లండి'' అని సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే శాకుంతలం మూవీని కంప్లీట్ చేసిన ఆమె ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తోంది.