ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సమత  కేసు నిందితులు

ఆదిలాబాద్ జిల్లా సమత  కేసులో నిందితులను  ఫాస్ట్  ట్రాక్  కోర్టులో  హాజరుపరిచారు  పోలీసులు.  షేక్ బాబు,  షేక్ షాబుద్దీన్,  షేక్ ముగ్ధుమ్ లను జిల్లా జైలు నుంచి  తీసుకెళ్లి  జడ్జి ముందు  ప్రవేశపెట్టారు.  సెక్షన్ 302, 376 (D),  సెక్షన్ 3 సబ్ క్లాస్ 2,  సబ్ క్లాస్ 5 ప్రకారం చార్జీ షీట్ దాఖలు చేశారు పబ్లిక్ ప్రాసిక్యూటర్.  వారం రోజుల్లోనే ట్రయల్ షెడ్యూల్ ఇచ్చారు. పోలీసులు మినహా 42  మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది.  డిసెంబర్  చివరి  వరకు సమత  కేసు తీర్పు వెలువడే అవకాశముందున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్.  ఇవాల్టి(సోమవారం) నుంచి ప్రతీ రోజు సమత కేసును విచారించనుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

మరోవైపు నిందితుల తరఫున వాదించకూడదని బార్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఇదే విషయాన్నిలాయర్లు  జిల్లా జడ్జీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల తరఫున వాదించేందుకు ప్రభుత్వమే ఓ లాయర్ ను నియమించే అవకాశముంది.

Latest Updates