సమత కేసులో తీర్పు నేడే..!

సమత కేసులో ఇవాళ తీర్పు రానుంది.  ఈ నెల 27న రావాల్సిన తీర్పు…. స్పెషల్ కోర్టు జడ్జి లీవ్ పెట్టడంతో…. ఇవాళ్టికి వాయిదా పడింది. ఆసిఫాబాద్  జిల్లా… అటవీ ప్రాంతంలో….  నవంబర్  24న  సమతపై  అత్యాచారం, హత్య  జరిగింది. అదే గ్రామానికి  చెందిన షేక్  బాబా,  షేక్  షాబొద్దీన్ , షేక్  మగ్దూమ్ లు సామూహిక  అత్యాచారం చేసి  హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు  చేశారు.  కేసు విచారణకు డిసెంబర్ 11న ఆదిలాబాద్ లో ప్రత్యేక కోర్టును  ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు, పోలీసు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్  వైద్యులు… మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారించింది. డిసెంబర్ 31న కోర్టు విచారణ పూర్తి చేసింది. ఈనెల 20తో ప్రాసిక్యూషన్,  డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగిశాయి.
మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?

Latest Updates