దేశవ్యాప్తంగా ఒకే తరహా డ్రైవింగ్‌ లైసెన్సులు

same-style-driving-licenses-nationwide

దేశవ్యాప్తంగా ఒకే తరహా ఫార్మాట్‌, డిజైన్‌తో డ్రైవింగ్‌ లైసెన్సులు ఉండాలనే ఉద్దేశ్యంతో వాటి ఫార్మాట్‌ మార్చనున్నారు. స్మార్ట్‌ కార్డు తరహాలో డ్రైవింగ్‌ లైసెన్సులను జారీ చేయాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒకే ఫార్మాట్‌ ఉండే డ్రైవింగ్‌ లైసెన్సును జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్‌ఐసి అభివృద్ది చేసిన సారథి అప్లికేషన్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా డ్రైవింగ్‌ లైసెన్సులకు కామన్‌ డేటాబేస్‌ను రూపొందించనున్నారు. సారథి సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ద్వారా నకిలీ రికార్డులను ఆన్‌లైన్‌లో గుర్తించే అవకాశం ఉంటుంది.

 

Latest Updates