డాక్టర్ “దిశ” పై అభ్యంతరకర పోస్ట్ లు : స్మైలీ నాని అరెస్ట్

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నిందితుడు స్మైలీ నానిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రాబందుల రాజ్యంలోకి.. రాకాసుల మూక మధ్య పంపుతున్న భయం కలుగుతోంది. షాద్ నగర్‌లో జరిగిన ఘటనలో క్రూరత్వం అంత భయానకంగా ఉంది.

అంతటి ఘోరంగా ఓ బిడ్డను హింస పెట్టిన ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘ఆ మానవ మృగాలను మాకు అప్పగిస్తారా? మీరే ఎన్‌కౌంటర్ చేస్తారా?’ అని నినాదాలు చేస్తున్నారు. ఇది నాణేనికి ఓ వైపు అయితే… రెండో వైపు ఈ ఘటనలోనూ పైశాచికానందాన్ని వెతుక్కుంటున్న మృగాలు బయటపడుతున్నాయి.

దిశపై అభ్యంతరకరంగా పోస్ట్ లు 

షాద్ నగర్ ఘటనపై వికృతంగా పోస్టులు, కామెంట్లు చేసి.. పైశాచికానందాన్ని పొందాయి. అలాంటి కొందరిపై హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నిజామాబాద్ కు చెందిన శ్రీరామ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా గుంటూరు కు చెందిన స్మైలీ నానీ అనే ఫేస్ బుక్ యూజర్ ను గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు.

గ్రూప్ గా ఏర్పడి వివాదాస్పద పోస్ట్ లు చేస్తున్న నిందితులు 

 చాలా మంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు నష్టపోతున్నారని, రేప్ చేయడం తప్పుకాదని అంటూ గుంటూరుకు చెందిన స్మైలీ నాని అనే ఫేస్‌బుక్ యూజర్ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాడు. హార్మోన్స్ వల్ల కంట్రోల్ చేసుకోలేక రేప్ చేస్తారని సమర్థించేలా మాట్లాడాడు అతడు.

కాగా పోలీసులు చేపట్టిన విచారణలో స్మైలీ నానితో పాటు మరికొందరు ఓ గ్రూప్ గా ఏర్పడి అభ్యంతర కంగా కామెంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

Latest Updates