కర్ణాటక వరద బాధితులకు సంపూర్ణేశ్ రూ.2 లక్షల విరాళం

sampoornesh-donates-rs-2-lakh-for-karnataka-flood-victims

సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే వారిలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు ఒకడు. గతంలో అనేక విపత్తుల సందర్భంగా తన వంతు సాయం అందించిన సంపూ… కర్ణాటకలో వరద బీభత్సం చూసి చలించిపోయాడు. వెంటనే  ఆ రాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.2 లక్షల విరాళం ప్రకటించాడు. ఉత్తర కర్ణాటకలో వరదలు చూసి ఎంతో విచారానికి గురయ్యానని, కన్నడ ప్రజలు తెలుగు సినిమాలపై ఎన్నో దశాబ్దాలుగా ఆదరణ చూపిస్తున్నారని సంపూ తెలిపాడు. తాను నటించిన హృదయకాలేయం చిత్రం కన్నడ నాట కూడా విజయవంతమైందని, కన్నడిగులు తననెంతో అభిమానిస్తుంటారని తెలిపాడు.

Latest Updates