శామ్ సంగ్ 8కే క్యూఎల్ఈడీ టీవీ

దక్షిణ కొరియా ఎలక్ట్రా నిక్స్‌ కంపెనీ శామ్‌ సంగ్‌ ఇండియా మార్కెట్లో కి తొలిసారిగా 8కే పిక్చర్‌ రిజల్యూషన్‌ తో క్యూఎల్‌ ఈడీ టీవీలను మంగళవారం విడుదల చేసింది. 98, 82, 75, 65 ఇంచుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ధరలు రూ.10 లక్షల నుంచి రూ.59 లక్షల వరకు ఉన్నాయి. సాధారణ హెచ్‌డీ టీవీల కల్లా ఇందులో 16 రెట్ల అధిక రిజల్యూషన్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. 33 మిలియన్‌ పిక్సల్స్ కెపాసిటీ ఉన్న స్క్రీన్‌ కావడం వల్ల విజువల్స్​​ క్లారిటీ అత్యద్భుతంగా ఉంటుందని పేర్కొంది. ఇందులో 8కే ప్రాసెసర్‌ , బిక్స్‌బీ, వాయిస్ కమాండ్స్‌, గూగుల్‌ అసిస్టెంట్‌, ఎయిర్‌ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లోనూ, షోరూంలలోనూ కూడా కొనుక్కోవచ్చు.