శామ్ సంగ్ ఏ70 ప్రిబుకింగ్స్ షురూ

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శామ్ సంగ్ ఈ నెల 18న విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ70 కొనుగోలుకు ప్రి బుకింగ్స్ మొదలయ్యాయి. దీని ధర రూ.28,990 వరకు ఉంది. ఈ నెల 30నుంచి డెలివరీలు మొదలు పెడతామని కంపెనీ ప్రకటించింది.

గెలాక్సీ ఏ70లో 6.7అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్ , ఆండ్రాయిడ్ 9.0 (పై) ఆపరేటింగ్ సిస్టమ్, క్వాల్ కామ్ఎస్ డీఎం 675 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్,  32 మెగాపిక్సెల్- 8 మెగాపిక్సెల్- 5 మెగాపిక్సెల్ సామర్థ్యం ఉన్న రేర్ కెమెరాలు… 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4500 mAh బ్యాటరీ వంటి సదుపాయాలు ఉన్నాయి.

Latest Updates