శాంసంగ్ తెచ్చేసింది: ఫోల్డింగ్ ఫోన్

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ ఫోల్డింగ్ స్మార్ట్‌‌ఫోన్ తో పాటు 5జీ ఫోన్‌‌ను ఆవిష్కరించింది. శాన్‌‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫోన్ ను శాంసంగ్ ప్రదర్శించింది. 4.6 ఇంచుల డిస్‌‌ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్‌‌ను ఓపెన్ చేస్తే 7.3 ఇంచుల టాబ్‌ లాగా ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్‌‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శాంసంగ్ ఫోల్డింగ్ ఫోన్ ఏప్రిల్ 26 నుండి అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ తెలిపింది. దీని ప్రారంభపు ధర 1980 డాలర్లుగా ఉంటుందని వెల్లడించింది. అంటే మన ఇండియన్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.1.40 లక్షలకు పైగానే ఉంటుంది.

ఫోన్‌‌ను ట్యాబ్ గా వాడేటప్పుడు ఒకేసారి మూడు యాప్ లను ఉపయోగించుకునే సదుపాయం ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ మెమరీ తో పాటు 4380 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ ‘పై’ అపరేటింగ్ సిస్టమ్ మీద ఇది పని చేస్తుంది. ఈ ఫోన్లో మొత్తం ఆరు కెమెరాలున్నాయి. 16 మెగాపిక్సెల్, 12+12 మెగాపిక్సెల్ తో మొత్తం మూడు కెమెరాలు వెనకవైపుండగా, ముందువైపు మరో 3 కెమెరాలున్నాయి. ఫోన్‌‌ను మడతపెట్టినప్పుడు రెండు కెమెరాలు లోపలికి వెళ్లిపోగా, ఒక 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Latest Updates