శామ్‌‌సంగ్‌‌ ఫోన్లు కొంటే కానుకలు

samsung-summer-surprize-on-june-1st

హైదరాబాద్‌‌, వెలుగు: అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా శామ్‌‌సంగ్‌‌ ‘సమ్మర్‌‌ సర్‌‌ప్రైజ్‌‌ ఆఫర్‌‌’ను తీసుకొచ్చింది. ఈ నెల ఒకటి నుంచి 30వ తేదీ వరకు శామ్‌‌సంగ్‌‌ ఫోన్‌‌ కొన్న వారికి లక్ష రూపాయల విలువైన 50 అంగుళాల క్యూఎల్‌‌ఈడీ టీవీ సహా పలు కానుకలు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌‌ హైదరాబాద్‌‌, వైజాగ్‌‌, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్‌‌, రాజమండ్రి తదితర చోట్ల అందుబాటులో ఉంది. టీవీతోపాటు గెలాక్సీ ఫోన్లు, స్మార్ట్‌‌ ఎల్‌‌ఈడీ టీవీలు, పవర్‌‌ బ్యాంక్‌‌లు వంటి ఈ ఆఫర్‌‌ సమయంలో గెలుచుకోవచ్చు.  గెలాక్సీ ఏ20, ఏ30, ఏ50, ఏ70,ఎస్‌‌10ఈ, ఎస్10, ఎస్‌‌10ప్లస్‌‌, నోట్‌‌9 ఫోన్ల కొనుగోలుకు మాత్రమే ఆఫర్‌‌ వర్తిస్తుంది. వారం, నెలవారీగా లక్కీడ్రా తీసి విజేతల పేర్లను
వెల్లడిస్తారు.

 

Latest Updates