మనదేశంలో శాంసంగ్ ఫోన్ ప్లాంట్​

Samsung to make more in India, invest Rs 2,500 cr
  • నోయిడాలో రూ.2,500 కోట్లతో ఏర్పాటు
  • ఫోకస్ పెంచిన దక్షిణ కొరియా కంపెనీ

ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ తయారీదారి శాంసంగ్ మన దేశంలో రూ.2,500 కోట్ల  పెట్టుబడులు పెట్టాలను కుంటోం ది. ఈ పెట్టుబడులతో ఇండియాను కాంపోనెంట్స్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేయాలనుకుంటోంది. శాంసంగ్ కొత్తగా శాంసంగ్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే కో, శాం సంగ్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ ఇండియా పేర్లతో రెండు కాంపోనెంట్ మానుఫ్యాక్చరింగ్​ సంస్థలను ఏర్పాటు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండు సంస్థలు శాంసంగ్ ఇండియాకు, ఇతర స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్  వెండర్లకు కాంపోనెంట్  ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సరఫరా చేయనున్నాయి. శాంసంగ్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ ఇండియా లిథియం ఐయాన్ బ్యాటరీ మానుఫ్రాక్చరింగ్ యూనిట్‌ ను లాంచ్ చేయాలనే ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఉంది. అంతేకాక కంపెనీకి చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ శాంసంగ్ వెంచర్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇండియాలో తన ఆపరేషన్స్‌ ను లాంచ్ చేసింది. దీంతో ఇండియాలోని స్టార్టప్‌ లకు ఎలక్ట్రానిక్స్ హార్డ్‌ వేర్, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ పరంగా సాయం చేయనుంది.

2022 వరకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫో న్ యూజర్ల సంఖ్య 82.9 కోట్లకు పెరగనున్నారనే అంచనాల నేపథ్యం లో ఇండియన్ మార్కెట్‌ పై శాంసంగ్ ఎక్కు వగా ఫోకస్ చేస్తోం ది. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ మార్కెట్‌ . ఎగుమతుల  ప్రోత్సాహకాల కోసం శాంసంగ్ కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆశ్రయించింది. ఇండియా నుంచి కాంపోనెంట్లు ఎగుమతి చేయాలని శాంసంగ్ భావిస్తోం ది. నోయిడాలో ఫోన్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే తయారీ చేపట్టేందుకు రూ.1,500 కోట్లతో ఓ ప్లాంట్‌ ను నిర్మించబోతుంది. దీని కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.

స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ పై దిగుమతి  సుంకాలను పెంచుతూ ప్రభుత్వం మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తుండటంతో, శాం సంగ్ ఇక్కడే తన కాంపోనెంట్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించాలనుకుంటోంది. కీలక స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ కాంపోనెంట్ల దిగుమతులపై గతేడాది కేం ద్ర ప్రభుత్వం 10 శాతం పన్నును విధించిం ది. మరోవైపు శాంసంగ్ బ్రాండ్‌ కు ఇండియాలో బాగా పాపులారిటీ ఉంది. అటు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ వాడకం కూడా పెరుగుతోంది. దీంతో కంపెనీ తన వ్యాపారాలను ఇండియాలో మరింత విస్తరిస్తోంది.ఇటీవలే శాంసంగ్ ఇండియా మహారాష్ట్రకు చెందిన ఇండస్ యాప్ బజార్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో గెలాక్సీ యాప్ స్టోర్‌ లో12 విభిన్న స్థానిక భాషలను సపోర్టు చేయనుంది. గతేడాదే శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ ప్లాంట్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. దీని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విలువ రూ.5,033 కోట్లు .

Latest Updates