పెళ్లి వాహనంపై బోల్తా పడ్డ ఇసుక లారీ.. ఎనిమిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబీలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వాహనంపై ఇసుక లారీ పడడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు తమ బంధువుల వివాహానికి హజరై వస్తున్నారు. వీరి వాహనం హైవేపై వెళ్తుండగా.. వీరి పక్కనుంచి వెళ్తున్న ఇసుక లారీ టైర్ పేలింది. దాంతో కంట్రోల్ తప్పిన ఇసుక లారీ.. స్కార్పియోపై పడింది. దాంతో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఏడుగురితో పాటు డ్రైవర్ కూడా మరణించాడు. మరణించిన వారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. జేసీబీల సాయంతో వాహనాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తెలిసి.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

For More News..

ఆరుగురు ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్స్‌తో పెళ్లికొచ్చిన క్లబ్ ఓనర్

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

చంద్రుడిపై దిగిన విదేశీ రోవర్

Latest Updates