సందీప్ కిషన్ కొత్త బిజినెస్.. విజయవాడలో కటింగ్ షాప్

హీరోగా , ప్రొడ్యూసర్ గా యంగ్ హీరో సందీప్ కిషన్  దూసుకుపోతున్నాడు. ఇటీవల నిను వీడని నేను,  తెనాలి రామకృష్ణ విజయాలతో మంచి ఊపుమీదున్నాడు. అదే విజయానందంతో బెంజ్ GLE 350D కారును తల్లిదండ్రులకు గిప్ట్ గా ఇచ్చాడు. అటు వ్యాపార రంగంలోనూ ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్ లో  వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లు నడుపుతున్న సందీప్ కిషన్ మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నాడు. విజయవాడలో త్వరలో ఒక సెలూన్ ప్రారంభించనున్నాడు. స్టైలిష్ రంగంలో పేరొందిన QBS సెలూన్ ఫ్రాంచైజీని  తీసుకున్నాడు సందీప్ కిషన్. త్వరలో ఆ సెలూన్ ప్రారంభించనున్నాడు.

Latest Updates