సాన్ డిస్క్ నుంచి 1టీబీ పెన్‌డ్రైవ్

వెస్టర్ న్ డిజిటల్‌ కార్పొరేషన్‌కు చెందిన సాన్‌డిస్క్ ‘అల్ట్రా డ్యూయల్ లక్స్’ పేరుతో ఏకంగా 1టీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగిన పెన్‌డ్రైవ్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ‘టైప్ సి’ పెన్‌డ్రైవ్ ను మొబైల్ లు, ల్యా ప్ టాప్స్‌, ట్యాబ్స్‌కు ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూఎస్ బీ 3.1 టెక్నాలజీని ఉపయోగించడం వల్ల సెకనుకు 150 ఎంబీల డేటాను కాపీ చేయగలుగుతుంది. దీని ధర రూ.13,529 అని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ ద్వారా ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నట్టు తెలియజేసింది.

Latest Updates