రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ క్రికెట్‌‌ డైరెక్టర్‌‌గా సంగక్కర

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీ రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ తమ టీమ్​ క్రికెట్‌‌ డైరెక్టర్‌‌గా.. శ్రీలంక మాజీ కెప్టెన్‌‌ కుమార సంగక్కరను నియమించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఆదివారం అఫీషియల్‌‌గా ప్రకటించింది. ఫ్రాంచైజీకి సంబంధించిన ఎంటైర్‌‌ క్రికెట్‌‌ సిస్టమ్‌‌ను సంగ పర్యవేక్షించనున్నాడు. కోచింగ్‌‌ స్ట్రక్చర్‌‌, యాక్షన్‌‌ ప్లాన్‌‌, టీమ్‌‌ స్ట్రాటజీ, టాలెంట్‌‌ డిస్కవరీ, డెవలప్‌‌మెంట్‌‌తో పాటు నాగ్‌‌పూర్‌‌లో ఉన్న రాయల్స్‌‌ అకాడమీ అభివృద్ధి పనులన్నీ కూడా సంగక్కర చేతుల మీదుగానే జరగనున్నాయి. ‘ఫ్రాంచైజీ క్రికెట్‌‌ స్ట్రాటజీతో పాటు వరల్డ్‌‌ వైడ్‌‌గా ఉన్న కాంపిటీషన్‌‌ను తట్టుకునే విధంగా టీమ్‌‌ను రూపొందించడం, డెవలప్‌‌మెంట్‌‌ ప్రోగ్రామ్స్‌‌, క్రికెటింగ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను మెరుగుపర్చడం నా బాధ్యత. టీమ్‌‌ ఫ్యూచర్‌‌ ఫౌండేషన్‌‌కు అవసరమైన కుర్రాళ్లను వెతికి పట్టుకుని వాళ్లను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఈ చాన్స్‌‌ నాకు కొత్తగా, ఉత్సాహంగా అనిపించింది. అందుకే డైరెక్టర్‌‌గా బాధ్యతలు తీసుకున్నా’ అని సంగక్కర పేర్కొన్నాడు. మోడ్రన్‌‌ క్రికెట్‌‌లో గ్రేట్‌‌ ప్లేయర్‌‌గా పేరు తెచ్చుకున్న సంగక్కర.. 16 ఏళ్ల కెరీర్‌‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 28 వేల రన్స్‌‌ చేశాడు.

Latest Updates