మున్సిపల్ చైర్మన్ బరిలో నా భార్య: జగ్గారెడ్డి

సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థి బీసీలకు కేటాయిస్తే.. తన భార్య నిర్మలా జగ్గారెడ్డికి టికెట్‌ ఇస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు, అభివృద్ధి చేసేందుకే ఆమెను బరిలో దింపుతున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడారు జగ్గారెడ్డి.

తానేంటో సంగారెడ్డి ప్రజలకు తెలుసన్నారు.సంగారెడ్డి కి ఐఐటి, అగ్రికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కాలేజి, రాజీవ్ పార్క్,  ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం తీసుకొచ్చానన్నారు. ఇవన్నీ కేసీఆర్ గాని, ఆరోపనులు చేస్తున్న నేతలు తీసుకురాలేదున్నారు.

సింగూర్ జలాల ను తరలించి, సంగారెడ్డి లో నీటి కష్టాలను సృష్టించిన  హరీష్ రావు ఏ ముఖం పెట్టుకుని సంగారెడ్డి లో తిరుగుతారు… సంగారెడ్డి ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. రాజకీయాల్లో హరీష్ రావు తనకన్నా చాలా జూనియరని..కేసీఆర్ పుణ్యాన హరీష్ రాజకీయాల్లో ఎదిగారన్నారు.

ప్రజల సమస్యలు తీర్చకపోయిన డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని  టీఆరెస్ నాయకులు అనుకుంటున్నారని…అయితే ఎవరికి ఓటు వేయాలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే నాయకులను  ప్రశ్నించే అవకాశం కోల్పోతారన్నారు. సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్‌దే గెలుపని జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు.

Latest Updates