సంగారెడ్డి పాప దొరికింది: మా బిడ్డ చనిపోయినందుకే కిడ్నాప్

సంగారెడ్డి మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో కిడ్నాప్ అయిన పాప దొరికింది. ఎల్లారెడ్డి మండలం శివనగర్ లో పాప జాడను కనుగొన్నారు పోలీసులు. శివనగర్ కు చెందిన శోభ, మళ్లేశం దంపతులు పాపను  కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. వీరి నుంచి పాపను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో దొరికిన ఈ పాపను సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌‌ సమక్షంలో పాప తల్లికి అప్పగించారు. రెండు రోజులుగా పాపకు తల్లి పాలు లేకపోయేసరికి బిడ్డ నీరసించి పోయినట్టు చెప్పారు. చికిత్సకోసం మెదక్ హాస్పిటల్ లో పాపను జాయిన్ చేస్తున్నట్లు తెలిపారు.

sangareddy-missing-baby-found-in-yellareddy

మా పాప చనిపోయింది అందుకే కిడ్నాప్ చేశాం
పాపను ఎత్తుకు పోయిన శోభ, సంతోష్ లను విచారించారు పోలీసులు. పది రోజుల క్రితం శోభ, సంతోష్ ల కోడలికి పాప పుట్టి చనిపోయిందని తెలిపారు. అయితే చనిపోయిన వారి మనమరాలి స్థానంలో మరో బిడ్డను ఉంచేందుకే కిడ్నాప్ చేసినట్టుగా తెలిపారు. దీంతో.. సంగారెడ్డిలోని హాస్పిటల్ లో బిడ్డను కిడ్నాప్ చేసినట్టు సంతోష్ విచారణలో తెలిపారని పోలీసులు చెప్పారు.

సంగారెడ్డి జిల్లా కల్పగూర్ గ్రామానికి చెందిన మాధవి, మళ్లేశం దంపతులకు ఏప్రిల్ 30న మాతా శిశు కేంద్రంలో ఆడబిడ్డ పుట్టింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాక.. యెల్లో జాండీస్( పచ్చ కామెర్లు) రావడంతో చికిత్స కోసం తిరిగి.. మాతా శిశు కేంద్రానికి వెళ్లారు. అయితే ట్రీట్ మెంట్ తర్వాత.. నర్స్ ఆ బిడ్డను తల్లికి ఇచ్చేందుకు పిలిచింది. దీంతో అక్కడే ఉన్న ఓ మహిళ తానే ఆ బిడ్డకు తల్లిని అని చెప్పి పాపను  తీసుకెళ్లింది. అయితే బిడ్డ కోసం అసలైన తల్లి వచ్చేసరికి పాప కిడ్నప్ అయినట్టు తెలిసుకుని షాక్ అయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పాప జాడను కనుగొన్నారు.

Latest Updates