కేసీఆర్ అసమర్ధపాలనతో రాష్ట్రం పాతాళానికి: జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్ అసమర్ధపాలన వల్ల ధనిక తెలంగాణ అప్పుల తెలంగాణగా మారిందని అన్నారు కాంగ్రెస్ నాయకులు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గాందీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… 2018ఎన్నికలలో రెండో సారి అధికారంలోకి వచ్చి.. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఒక్కటికూడా నెరవేర్చలేదని చెప్పారు. తియ్యటి మాటలు చెప్తూ నోరు తీపి చేస్తున్నడు తప్ప ప్రజల కడుపు నింపడంలేదని చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. గతంలో ఏడాదికి మూడు కోట్లు ఇచ్చేవారని.. ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదని చెప్పారు.

17వేల కోట్ల అదనపు ఆదాయంతో ధనిక రాష్ట్రంగా దేశంలో హుందాగా ఉన్న తెలంగాణను ఈరోజు.. కేసీఆర్ అసమర్ధ పాలన వల్ల 3లక్షల కోట్ల అప్పును ప్రజలనెత్తిన రుద్దారని చెప్పారు జగ్గారెడ్డి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన…  నిరుద్యోగ భృతి, రుణమాఫీ, కొత్త ఉద్యోగాలు, పీఆర్సీ, రైతు బంధు, మద్దతు ధరలు, ధరల నియంత్రణ ఏవి అమలు కాలేదని చెప్పారు. అవినీతి లో రాష్ట్రం 5వ స్థానంలో ఉండడం ఆందోళన కరమని చెప్పారు…  విద్య పూర్తి స్థాయిలో దెబ్బ తిన్నదని… 12 వేల గవర్నమెంట్ స్కూళ్లను మూసివేస్తాం అంటున్నారని తెలిపారు. పేదలకు ఆ మాత్రం చదువు కూడా అందకపోతే ఎలాఅని ప్రశ్నించారు జగ్గారెడ్డి. విద్యలో రాష్ట్రం దేశంలోనే.. 13వ స్థానంలో ఉండడం బాధాకరమని చెప్పారు.

హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం.గుడ్లు కూడా అందడం లేదని చెప్పారు జగ్గారెడ్డి. వైద్యం పరిస్థితి దారుణంగా మారిపోయిందని.. 108 ఉద్యోగులకు, ఆరోగ్య శ్రీ కి కూడా డబ్బులు లేక పోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం నిలిపివేయడం ప్రభుత్వనికి అవమనకరమని అన్నారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లేవని… హత్యలు, అత్యాచారలు రోజురోజుకూ పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Latest Updates