సంగారెడ్డి ఎమ్మెల్యే ఏడాది నుంచి కనబడటం లేదు: మంత్రి హరీష్

సంగారెడ్డి: సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్‌కు ప్రజల నుండి పూర్తి మద్దతు లబిస్తుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటిలు టీఆర్ఎస్‌ గెలుచుకోవడం ఖాయమని మంత్రి హరీష్ అన్నారు. సంగారెడ్డి, సదాశివపేటలలో అవాకులు చవాకులు పేలే నేతలను తిరస్కరించాలని, ఒక్కసారి మీ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించి ఓటెయాలని ఆయన కోరారు.

‘జగ్గారెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఆయన భార్యబిడ్డలు ఇంటింటికి తిరిగి బాధపడితే ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన ఈ నియోజకవర్గంలో ఏడాది నుండి కనపడటం లేదు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సంగారెడ్డిని ఇంకా అభివృద్ది చేసుకుందాం. సదాశివపేట అభివృద్ది నాదే బాద్యత. మున్సిపాలిటీల్లో అభివృద్ది టీఆర్ఎస్‌తోనే సాద్యం. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ది కుంటుపడుతుంది. మంజీరా, సింగూరులకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి. నెలరోజులుగా రంగనాయక్ సాగర్‌కి కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. ఏడాదిలోగా సంగారెడ్డికి కూడా వస్తాయి. సంవత్సరంలోపు ఇంటింటికి గోదావరి నీళ్లు ఇస్తాం. సంగారెడ్డికి రెండు నెలలకోకసారి వచ్చి అభివృద్ది పనులను సమీక్షిస్తా. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం అందేలా చూస్తాం. లింగాయత్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బసవేశ్వర జయంతి చెస్తున్నాం. ట్యాంక్‌బండ్ మీద విగ్రహం కూడా పెట్టాం. జిల్లా మంత్రిగా సదాశివపేట అభివృద్ది బాధ్యత నాదే. పోయినసారి ఎన్నికల్లో రాత్రి సెటిల్‌మెంట్ చేసుకున్న వ్యక్తి.. ఈ సారి సదాశివపేట చైర్మన్ నేనే అవుతానని తిరుగుతున్నాడు. ఈ ఎన్నికల తరువాత లింగాయత్ వర్గానికి జిల్లా కేంద్రంలో ఎకరం స్థలం ఇప్పిస్తాం. ఇండిపెండెంట్‌లు‌గా పోటీ చేసిన వ్యక్తులు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ టిఆర్ఎస్‌లోకి వస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అటువంటి వారిని సస్పెండ్ చేస్తాం కానీ, మళ్లీ టీఆర్ఎస్‌లోకి తీసుకోము’ అని ఆయన అన్నారు.

For More News..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

ఇకనుంచి షాపులు రాత్రుళ్లూ ఓపెన్

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

Latest Updates