సంగీత ఫొగట్‌ను పెళ్లాడనున్న బజ్‌రంగ్‌

sangeeta-phogat-will-marry-to-bajrang-punia

న్యూఢిల్లీ:  గీతా ఫొగట్‌–పవన్‌ కుమార్‌, సాక్షి మాలిక్‌–సత్యవర్త్‌ కడియన్‌, వినేశ్‌ ఫొగట్‌–సోమ్‌వీర్‌ రాతి.. వివాహ బంధంతో ఒక్కటైన ఇండియా  రెజ్లర్లు. ఈ క్లబ్‌లో మరో జంట చేరనుంది. ఇండియా స్టార్‌ రెజ్లర్‌,  వరల్డ్‌ నంబర్‌ వన్‌ బజ్‌రంగ్‌ పునియా (65కేజీ)..  ఫొగట్‌ సిస్టర్లలో చిన్నదైన సంగీత ఫొగట్‌ను  వివాహం చేసుకోనున్నాడు. మూడేళ్లుగా  ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత  పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఒలింపిక్స్‌లో మెడల్‌ ఆశిస్తున్న బజ్‌రంగ్‌, 59కేజీ కేటగిరీలో నేషనల్‌ మెడలిస్ట్‌ అయిన సంగీత ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని సంగీత తండ్రి,  లెజెండరీ కోచ్‌ మహవీర్‌సింగ్‌ పొగట్‌ తెలిపాడు. ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోకపోయినా పిల్లల అభిప్రాయాన్ని గౌరవిస్తామని చెప్పాడు.

Latest Updates