సానియా ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి తప్పుకుంది

చాలా కాలం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలో టైటిల్ నెగ్గి తన సత్తా చాటుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడకుండానే తప్పుకుంది. ఉక్రెయిన్ పార్ట్నర్ నదియా కిచెనోక్‌తో కలిసి ఇటీవలే హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గిన సానియా.. కాలి గాయంతో ఇబ్బంది పడుతోంది. ఇవాళ(గురువారం) జిన్‌యున్‌ హాన్‌లిన్‌ జు (చైనా) జోడీతో జరిగాల్సిన మహిళల డబుల్స్ మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉంది. సానియా వైదొలగడంతో …నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడనున్నాడు.