వెబ్ సిరీస్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా

అద్భుతమైన ఆటతీరుతో పాటు… తన అందంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆటకు దూరంగా ఉంటోంది. అంతేకాదు కరోనాతో ఎక్కడా టెన్నిస్ టోర్నీలు కూడా జరగడం లేదు.

ఈ క్రమంలో లేటెస్టుగా సానియా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెన్నిస్ రాకెట్ ను పక్కన పెట్టి, యాక్టింగ్ రంగంలోకి సానియా అడుగుపెట్టబోతోందట. బుల్లితెరపై మెరవడానికి సానియా సిద్ధమవున్నట్లు సమాచారం. నిషేద్ ఎలోన్ టుగెదర్ అనే వెబ్ సిరీస్ లో సానియా నటిస్తోందట. మొత్తం ఐదు ఎపిసోడ్ లుగా ఈ సిరీస్ ప్రసారం కానున్నట్లు టాక్ .

Latest Updates