ఈ చెత్త యాడ్స్‌‌తో హైప్‌‌ అవసరమా?: సానియా

sania-mirza-slams-cringeworthy-tv-ads-ahead-of-india-pakistan-tie

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్‌‌ మధ్య ఆదివారం జరగనున్న వరల్డ్‌‌కప్‌‌ మ్యాచ్‌‌ సందర్భంగా ఇరుదేశాల్లో ప్రసారమవుతున్న టీవీ యాడ్స్‌‌పై టెన్నిస్‌‌ స్టార్‌‌ సానియా మీర్జా మండిపడింది. ఇండో–పాక్‌‌ మ్యాచ్‌‌ నేపథ్యంలో పాకిస్థాన్‌‌కు చెందిన జాజ్‌‌ టీవీ.. ఇండియన్‌‌ వింగ్‌‌ కమాండర్‌‌ అభినందన్‌‌ను ఎగతాళి చేస్తూ రూపొందించిన యాడ్‌‌ను ప్రసారం చేస్తోంది. మ్యాచ్‌‌ జరిగే ఆదివారం ఫాదర్స్‌‌ డే కావడంతో స్టార్‌‌ నెట్‌‌వర్క్‌‌ ఇండియాలో ‘మోకా మోకా’ యాడ్‌‌కు కొనసాగింపును ప్రసారం చేస్తోంది.వీటిపై సానియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సరిహద్దుకు ఇరువైపులా చెత్త యాడ్స్‌‌ ప్రసారమవుతున్నాయి. ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రయోగాలతో మ్యాచ్‌‌కు మీరేం హైప్‌‌ తీసుకురావాల్సిన పనిలేదు. ఇప్పటికే కావాల్సిన దానికంటే ఎక్కువ క్రేజ్‌‌ మ్యాచ్‌‌కు ఉంది. దేవుడి దయవల్ల అది ఓ క్రికెట్‌‌ మ్యాచ్‌‌  మాత్రమే. దీన్ని అంతకుమించి అని భావిస్తే  స్వీయ నియంత్రణ చేసుకోండి’ అని ట్వీట్‌‌ చేసింది.

Latest Updates