‘మహిళలకు రూ.1కే శానిటైజేషన్ ప్యాడ్స్ అందించాం’

న్యూఢిల్లీ: పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోటలో కరోనా వ్యాక్సిన్, వ్యవసాయం, సైనికులతోపాటు మహిళా సాధికారతపైనా ప్రధాని మోడీ ప్రసంగించారు. తన సుదీర్ఘ ప్రసంగంలో విమెన్ ఎంపవర్‌‌మెంట్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. శానిటైజరీ ప్యాడ్స్, రుతుస్రావం, మహిళలపై ఉన్న నిషేధాల గురించి ప్రధాని మోడీ మాట్లాడటాన్ని సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

‘మన ఆడ బిడ్డలు, చెల్లెళ్ల ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. 6 వేల జనౌషాధి సెంటర్స్ ద్వారా సుమారు 5 కోట్ల మహిళలకు రూ.1కే శానిటరీ ప్యాడ్స్ అందించాం. వారి వివాహాల కోసం కమిటీని వేశాం. తద్వారా సరైన టైమ్‌లో డబ్బులను వినియోగించొచ్చు. మహిళా సాధికారత కోసం మేం పని చేస్తున్నాం. నేవీ, ఎయిర్‌‌ ఫోర్స్‌లో విమెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మహిళలు లీడర్లు. మేం ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాం’ అని మోడీ చెప్పారు.

Latest Updates