సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

లాక్ డౌన్ లోనూ సేవ‌లందిస్తున్నందున మున్సిపల్ సిబ్బందికి రూ.7500, పంచాయతీ సిబ్బందికి రూ. 5 వేలు ముఖ్యమంత్రి కేసీఆర్ గిఫ్ట్ కింద ఇన్ స్టెంట్ గా ఇస్తామని ప్రకటించిన విష‌యం తెలిసిందే. దీంతో పలువురు మున్సిప‌ల్ సిబ్బంది, పంచాయ‌తీ సిబ్బంది సంతోషం వ్య‌క్తం చేస్తే సీఎం కేసీఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మం జిల్లా, తల్లాడ మండలం ముద్దునూరు గ్రామంలో పంచాయతీ సిబ్బంది కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

గ్రామపంచాయతీ ఉద్యోగుల, కార్మికుల శ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీర్ గుర్తించి.. గతంలో విధించిన వేతనాల్లో కోతలను మినహాయింపు ఇచ్చి.. పూర్తిస్థాయి వేతనాలు చెల్లించ‌డ‌మేకాక‌.. మున్సిపల్ సిబ్బందికి 7500, పంచాయతీ సిబ్బందికి 5000 రూపాయలు ముఖ్యమంత్రి గిఫ్ట్ కింద ఇన్ స్టెంట్ గా ఇస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Latest Updates