రాను మండల్ ని తలపిస్తున్న మున్సిపల్ ఉద్యోగి

కచ్రా సుఖ యూఆర్ గిలా.. సబ్నేమిలా కర్ చాలా..కచ్రే నే లేలి సబ్కి జాన్ గౌర్ సే సునియే మెహెర్బాన్ అంటూ మున్సిపల్ ఉద్యోగి పాడిన పాట నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కోల్ కతా రణఘాట్ రైల్వేస్టేషన్ లో లతమంగేష్కర్ పాడిన పాట ఏక్ ప్యార్ నగ్మాహై అంటూ రాను మండల్ పాటపాడి ఎంత ఫేమస్ అయ్యిందో మనందరికి తెలిసిందే. రైల్వే స్టేషన్ లో ప్రయాణిస్తున్న ఓ టెక్కీ.. రాను మండల్ పాడిన పాటను  వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆమె గొంతుకు ఫిదా అయిన బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ హిమేష్ రేష్మియా తన సినిమాలో తేరీ మేరీ కహానీ అనే పాట పాడించాడు.

ప్రస్తుతం రాను మండల్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. రాను మండల్ కు పోటీగా మున్సిపాలిటీ ఉద్యోగి తెరపైకి వచ్చారు. తన మధురమైన గాత్రంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు.

పూణే మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహదేవ్ జాదవ్ పాడుతున్న పాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  మున్సిపల్ ఉద్యోగిగా పనిచేస్తున్న జాదవ్ కు పచ్చదనం, పరిశుభ్రత అంటే మక్కువ. అందుకే ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు.

బాలీవుడ్ సాంగ్స్ ను రీమేక్ చేస్తూ పరిశుభ్రత గురించి వివరిస్తున్నట్లు చెప్పాడు.  అయితే జాదవ్ పాడిన పాటలపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమాల్లో పాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Latest Updates