పెట్రోలింగ్ వెహికల్స్‌కు శానిటైజేషన్

పోలీసుల హెల్త్ , సేఫ్టీ ప్రికాషన్స్ పై ఫోకస్
వైరస్ కట్టడికి చర్యలు
సిబ్బందికి స్ప్రే బాటిల్స్

కరోనా బారిన పడకుండా పోలీసులు సేఫ్టీ ప్రికాషన్స్ పై ఫోకస్ పెట్టారు. కాంటాక్ట్ కేసులు పెరుగుతుండటంతో సిటీ రోడ్లపై తిరిగే పెట్రోలింగ్ వెహికల్స్ తో వైరస్ స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్న 32 వెహికల్స్ కు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.

వెహికల్స్ తో స్ప్రెడ్ కాకుండా..

కరోనా పాజిటివ్, సస్పెక్టర్స్,  కాంటాక్ కేసులను హాస్పిటల్ కి తరలించే టైమ్‌లో పెట్రోలింగ్ వెహికల్స్ స్పాట్ కి వెళ్తున్నాయి. ఈ క్రమంలో వైరస్ అంటుకుంటే, వెహికల్స్ తిరిగే ఏరియాల్లోనూ స్ప్రెడ్ అయ్యే చాన్స్ ఉంది. దాంతో వెహికల్స్ ను శానిటైజ్ చేయాలని సీపీ అంజనీకుమార్ ప్లాన్ చేశారు. ఆ మేరకు మహావీర్ గ్రూప్స్ సహకారంతో శనివారం ప్రతి వాహనానికి 2 శానిటైజర్స్ అందించారు. ఈ శానిటైజర్ స్ప్రే తో 4 రోజుల వరకూ కరోనాతోపాటు ఇతర వైరస్ లు వ్యాపించవని సీపీ తెలిపారు.

సిబ్బందికి మాస్క్ లు
లాక్ డౌన్తో 14 రోజులుగా డ్యూటీలో ఉన్న సిబ్బంది హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. సిటీలో గస్తీనిర్వహించే ప్యాట్రో కార్, బ్లూ కోల్స్ ట్ పోలీసులకు మాస్క్ లు, శానిటైజర్లు తప్పనిసరి చేశారు. స్టేషన్ లోని అడ్మిన్ స్టాఫ్, రోడ్లపై డ్యూటీ చేసే పోలీసులకు  హెల్త్ గైడ్ లైన్స్ జారీ చేశారు. ఓల్డ్ సిటీతోపాటు సిటీ కమిషన రేట్ పరిధిలోని 4 జోన్లను అలర్ చేశారు.

Latest Updates