శానిటైజర్లు అమ్మడానికి లైసన్సు అక్కర్లేదు

రూల్సు నుంచి మినహాయింపు

వ్యతిరేకిస్తున్న కెమిస్ట్ లు

న్యూఢిల్లీ: హ్యాండ్ శానిటైజర్లు అమ్మడానికి లేదా నిల్వ ఉంచేందుకు అవసరమైన లైసెన్సు నుంచి పభుత్వం మినహాయింపు ఇచ్చింది. డ్రగ్ అండ కాస్మెటిక్ యాక్ట్ కింద స్టాకింగ్ లేదా సేల్సు కు అవసరమైన లైసెన్ రిక్వైర్ మెంట్ నుంచి హ్యాండ్ శానిటైజర్లకు మినహాయింపు ఇస్తున్నట్లు హెల్త్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీ నోటిఫికేషన జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు ఈ శానిటైజర్ల ను మరింత అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే గడువు తీరిపోయిన ప్రాడక్ట్ ను మాత్రం నిల్వ ఉంచేందుకు లేదా సేల్  చేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన గెజెట నోటిఫికేషన వెంటనే అమలులోకి రానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ (ఏఐఓసీడీ) వ్యతిరేకిస్తోంది.

లైసెన్సింగ్ నిబంధనల నుంచి ఈ ప్రొడక్ట్ కు మినహాయింపు ఇవ్వవద్దని కెమిస్ట్ అసోసియేషన్ కోరుతోంది. ఈ అసోసియేషన్ లో ఎనిమిది లక్షల మంది కెమిస్టులు ఉన్నారు. ఫార్మశీలో కాకుండా మరెక్కడా హ్యాండ్ శానిటైజర్లు అమ్మకుండా చూడాలని కోరుతూ ప్రధానమంత్రి మోడీకి ఏఐఓసీడీ లేఖ రాసింది. ఈ శానిటైజరల్లో క్లోరో హెక్సిడైన్, హైడ్రో జన్ పెరాక్సైడ్, ఐస్రో ప్రొఫైల్, ఆల్కహాల్, గ్లిసరాల్, ఇథనాల్, ప్రొపైలిన్ గ్లైకాల్ వంటి డ్రగ్స్ ఉంటాయని పేర్కొంది. వీటిని లైసెన్సు పరిధిలోనే అమ్మాలని చెప్పింది.

ఫార్మశీలో అమ్మే శానిటైజర్లను ప్రభుత్వం తప్పనిసరిగా వాటిని చెక్ చేసి కంట్రోల్ చేస్తోందని తెలిపింది. కరోనా బాగా పెరుగుతుండటంతో హ్యాండ్ శానిటైజర్లకు అవసరమయ్యే రెగ్యులేటరీ కంట్రోల్ ను ప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. ఆల్కహాల్ హ్యాండ్ శానిటైజర్లు తయారు చేయలని లిక్కర్స్ మాన్యు ఫ్యాక్చరర్స్ కు ప్రభుత్వం ఇంతకుముందే ఆదేశించింది.

Latest Updates