క్యాన్సర్‌‌ను జయించిన మున్నాభాయ్

ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌‌ను విజయవంతంగా జయించాడు. తన ఆరోగ్యానికి సంబంధించి సంజూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు. తన హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందన్నాడు. గత కొన్ని వారాలు తనతోపాటు తన కుటుంబ సభ్యులకు చాలా కష్టంగా గడిచాయన్నాడు. క్యాన్సర్ పై యుద్ధంలో గెలవడం తనలో సంతోషాన్ని నింపిదన్నాడు. ప్రజల అచంచలమైన విశ్వాసం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదన్నాడు. తనకు మద్దతుగా అండగా కుటుంబీకులు, ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌‌కు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే తనకు ట్రీట్‌మెంట్ చేసిన కోకిలాబెన్ ఆస్పత్రి, డాక్టర్ సేవాంతితోపాటు ఆమె వైద్య బృందానికి మున్నాభాయ్ సంజూ కృతజ్ఞతలు తెలిపాడు.

Latest Updates