ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు: సంజయ్ దత్

ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదని స్పష్టం చేశాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఆయన రాష్ట్రీయ సమాజ్ పక్ష (RSP) లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు RSP వ్యవస్థాపకుడు మహాదేవ్ జంకర్ కూడా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై స్పందించిన సంజయ్ … జంకర్ తనకు స్నేహితుడని, సోదరుడిలాంటి వాడని,  అయితే తాను RSP చేరడంలేదని చెప్పాడు.

 

Latest Updates