నూతన సీవీసీగా సంజయ్ కొఠారి

  • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ: సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా సంజయ్ కొఠారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో కొఠారితో ప్రెసిడెంట్ రామ్​నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ అధికారులు హాజరయ్యారు. కరోనా ఎఫెక్టుతో కార్యక్రమానికి వచ్చినవారంతా మాస్కులు కట్టుకుని.. డిస్టెన్స్ పాటించారు. హర్యాన కేడర్ కు చెందిన 1978 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన కొఠారి.. ప్రస్తుతం రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీవీసీగా కేవీ చౌదరి పదవీకాలం పూర్తయిన తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ పదవి కిందటి ఏడాది జూన్ నుంచి ఖాళీగా ఉంది. ఆ ప్లేస్ లో సంజయ్ కొఠారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది.

Latest Updates