సంజయ్ మంజ్రేకర్ రేటింగ్.. శ్రేయస్ అయ్యర్ తర్వాతే కొహ్లీ

sanjay-manjrekar-rates-shreyas-iyer-a-better-captain-than-virat-kohli-in-ipl-2019

ఐపీఎల్ సీజన్ అయిపోయింది. ముంబై విన్ అయ్యింది. కానీ ఐపీఎల్ మ్యానియా నుంచి బయటకు రాలేకపోతున్నారు కొందరు. ఐపీఎల్ లో ఎవరు బెస్ట్ కెప్టెన్ అంటూ చర్చించుకుంటున్నారు. అయితే మాజీ క్రికెట్ సంజయ్ మంజ్రేకర్ ఐపీఎల్ లో బెస్ట్ కెప్టెన్ ఎవరనేది చెప్పేశాడు. కెప్టెన్లకు మార్క్స్ కూడా వేశాడు.అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ వీరాట్ కొహ్లీ కంటే ఢిల్లీ క్యాపిటల్స్  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఎక్కువ మార్కులు వేశాడు మంజ్రేకర్.  కొహ్లీకి తక్కువ మార్కులు వేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రచ్చ చేస్తున్నారు.

ఐపీఎల్ సీజన్ 12 లో ముంబై టీంను గెలిపించిన రోహిత్ శర్మకు 10 కి 8 మార్క్స్ వేశాడు. రోహిత్ నిలకడ కెప్టెన్ అని, రోహిత్ కెప్టెన్సీలో పెద్ద తప్పులు చేయడని మంజ్రేకర్ పొగిడాడు. ఇక చెన్నైని రన్నరప్ గా నిలిపించిన ధోనీకి 9 మార్కులు వేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీని క్వాలిఫయర్ 2 వరకు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యార్ కు 8, కొహ్లీకి 6 మార్కులు వేశాడు. మిగతా టీంలలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ కు 7 మార్కులు,  రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానే కు 5, స్మిత్ కు 6, సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు 7 మార్కులు వేసిన మంజ్రేకర్ కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్మీక్ కు అసలు మార్కులు వేయలేదు. ఇక దీనిపై స్పందించిన గౌతమ్ గంభీర్ కొహ్లీని, ధోనీ, రోహిత్ శర్మతో పోల్చడం సరికాదని అన్నాడు.

 

Latest Updates