శాంసన్‌, శిఖర్‌ ధనాధన్‌

  • ఐదో వన్డేలో ఇండియా- ఎ గ్రాండ్ విక్టరీ
  • సౌతాఫ్రికా- ఎ తో సిరీస్ 4-1 తో కైవసం

లోకల్‌ హీరో సంజు శాంసన్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 91),  టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగడంతో సౌతాఫ్రికా–ఎతో శుక్రవారం జరిగిన చివరి, ఐదో వన్డేలో ఇండియా–ఎ 36 రన్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో  కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన హోమ్‌టీమ్‌.. శాంసన్‌, ధవన్‌ మెరుపులతో 4 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 36) కూడా రాణించాడు. ఛేజింగ్‌లో  ఓవర్లన్నీ ఆడిన సఫారీ టీమ్‌ 168 రన్స్‌కు ఆలౌటై ఓడిపోయింది. రీజా హెండ్రిక్స్‌ (59), కైల్‌ వెరేన్‌ (44) మాత్రమే పోరాడారు. ఇండియా బౌలర్లలో శార్దుల్‌ మూడు, వాషింగ్టన్‌ రెండు వికెట్లతో సత్తా చాటారు. శాంసన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Sanju Samson, Shikhar Dhawan shine as India A complete 4-1 series win over South Africa A

Latest Updates