
హైదరాబాద్ : ముషీరాబాద్ బీజేపీ పార్టీ ఆఫీస్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా, అక్షర స్ఫూర్తి అధ్వర్యంలో పోటీలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన మహిళా కార్పోరేటర్లు, బస్తీ మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. ముగ్గులు వేయడం భారతీయ సాంప్రదాయమన్నారు. ముషీరాబాద్ లోని అన్ని డివిజన్స లో పోటీలు నిర్వహిస్తామన్నారు.