సంక్రాంతి వేళ.. సిటీ రోడ్లన్ని వెలవెల

నిత్యం రద్దీతో, ట్రాఫిక్‌తో కిటకిటలాడే భాగ్యనగరం రోడ్లు బోసిపోయాయి. సంక్రాంతి పండుగకు సిటీ జనం సొంతూళ్లకు వెళ్లడంతో నగరం సగం వరకు ఖాళీ అయింది. రోడ్లపై జనసంచారం కూడా గణనీయంగా తగ్గింది. నగరంలోని ముఖ్య కూడళ్లు, రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అటు హైద్రాబాద్ లో ఉండే ఏపీ పబ్లిక్ కూడా పండుగ కోసం ఊళ్లకు వెళ్లారు. దీంతో రాజధాని రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

సిటీలోని రద్దీ ప్రాంతాలైన లక్డీకపూల్, ఖైరతాబాద్ కోఠి, అమీర్ పేట్, కేపీహెచ్‌బి, హైటెక్ సిటి లలో కూడా జన సంచారం చాలా వరకూ తగ్గిపోయింది. అంతే కాకుండా బస్సుల్లో , మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య కూడా భారీగా తగ్గింది. వాహానదారులు తమ గమ్యస్థానాలకు చాలా సునాయాసంగా వెళుతున్నారు. మరి రెండ్రోజుల వరకూ నగరంలో ఇదే పరిస్థితి ఉండవచ్చు.

Sankranti Effect | Empty Roads And No Traffic In Hyderabad City

Latest Updates