అనుబంధాల కాంతి సంతోషాల.. సంక్రాంతి

కొత్త సంవత్సరంలో ఫస్ట్‌ పండుగ సంక్రాంతి. అచ్చంగా ఇది జానపదుల పండుగ. కష్టపడి పండించి న పంటలు ఇళ్లకు చేరే సమయంలో రైతన్నలు చేసుకునే సంబురం. విత్తు నాటినప్పటి నుంచి నోటిదాక వచ్చేవరకు తమ కష్టంలో పాలు పంచుకొని, తమ సుఖ సంతోషాలకు కారణమైన చెట్టూచేమకు, గొడ్డూ గోదకు కృతజ్ఞత చెప్పుకునే రోజు. గంగిరెద్దు ఆటలతో, గొబ్బి పాటలతో, హరిదాసు కీర్తనలతో ప్రకృతిని పూజించుకోవడమే సంక్రాంతి పండుగ స్పెషల్‌! ఇవ్వాళ ఏ పల్లెకెళ్లి చూసినా ముగ్గులు మెరిసిపోతుంటాయి. గాలి మొత్తం పిండివంటల ఘుమఘుమలతో నిండిపోతుం ది. పతంగుల రెక్కలతో ఆకాశం ఇంద్రధనుస్సు అవుతుంది. మూడు రోజుల ఈ పండుగ.. మధుర జ్ఞాపకాలు మెండుగ!

పంట చేతికొచ్చిన పండుగ సంక్రాంతి. పల్లెకు ధాన్యమే సిరి. ఆ సిరులను ముగ్గుల్లో అలంకరించి నట్లే.. కొత్త వంటకాలతో కొత్త రుచులను ఆరగిస్తారు. మకరరాశి వెలుగుల్లో ఎగిరే పతంగుల్లా సంతోషాల్లో తేలిపోయే సంబురం ఇది. కొత్త సంవత్సరంలో ఫస్ట్‌ పండుగ సంక్రాంతి. ఇది జానపదుల పండుగ. కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయంలో చేసుకునే సంబురం. అన్నింటికి మించి పర్యావరణాన్ని పూజించుకునే వేడుక.  గంగిరెద్దుల ఆటలతో, హరిదాసుల సంకీర్తనలతో, అమ్మాయిల గొబ్బి పాటలతో, కొత్త అల్లుళ్ళ రాకతో ఊరంతా సందడిగా మారే రోజు సంక్రాంతి.

ఆచారం… ఆరోగ్యం

మకర సంక్రాం-తిని ‘పంటకోతల పండుగ’,  ‘కుప్ప నూర్పి-డుల పండుగ’ అని కూడా పిలుస్తారు. పంట ఇంటికి వచ్చిన తర్వాత, మళ్లీ కొత్త పంట వే-యడానికి కావాల్సినవి సిద్ధం చేసుకోవాలన్న సోయి కూడా ఈ పండుగలో ఉంది. ఇక, ‘క్రాంతి’ అంటే వెలుగు, అభివృద్ధి అని రెండు అర్థాలు ఉన్నాయి. ‘సం’ అంటే చేరుకో-వడం. సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించడమే. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో కి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి. ఈ రోజును పవిత్ర పుణ్య దినంగా భావిస్తారు. ఈ పుణ్య ఘడియలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉంటాయి. ఈ రోజు కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండుతారు. మకరరాశికి అధిపతి శని. అందుకే ఈ రోజు శనికి ప్రీతికరమైన నల్లనువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, గుమ్మడికా-యలు దానం చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం , సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం.  నువ్వులు, బెల్లం తినడం వల్ల వ్యాధినిరో-ధక శక్తి పెరుగుతుంది. ఈ రోజున ఏ దైవాన్ని పూజించినా, యజ్ఞం చేసినా విశేష ఫలితం ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు వదులుతారు.

మకరం.. పురాణం

మకర సంక్రాం-తిలో ‘మకరం’ అంటే ‘మొసలి’ అని అర్థం . నీళ్లలో మొసలి పట్టుకుంటే వదలదు.  సుఖాలకు అలవాటుపడిన మనిషి మొసలి నోటిలో చిక్కుకున్న- వాడితో సమానం. దాని తాలూకు బాధలనుంచి తప్పించుకోలేడు.   సంక్రాంతి రోజు గుడికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తారు.  కొందరు నదుల్లో స్నానం చేసి, ఉపవాసం ఉంటారు. అలాగే ఈ పండుగకు సూర్యుడికి సంబంధం ఉంది. పురాణాల ప్రకారం సూర్యు డు ఇంద్ర, వరుణ, వాయుదేవతల సాయంతో వర్షాలు కురిపిస్తా-డు. అందుకే ఈ రోజు పొంగలిని సూర్యు డికి నై-వేద్యంగా పెడతారు. నీళ్లతో సూర్యుడికి నివేదన కూడా ఇస్తారు.

పండగ సందేశం

సంక్రాంతి రోజు సూర్యుడు మకరరాశిలోకి అడుగుపెడతాడు. మకర రాశికి శని అధి-ష్టాన దేవత. వరుసల ప్రకారం సూర్యు డు, శని తండ్రీకొడుకులు. అయితే వాళ్లిద్దరికి అసలు పడదు. కానీ ఈ పండుగరోజు కలుస్తారు. అందుకే సంక్రాంతి పండుగని శత్రువులు, మిత్రులు అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకోవాలని పెద్దలు చెప్తారు. అలాగే సంక్రాంతి ‘శంకర’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. ‘శంకర’ అంటే కదలిక అనే అర్థం . ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుంది. గ్రహాల కదలిక వల్లే సృష్టి నడుస్తుంది.  భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యు డి చుట్టూ తిరుగుతుం-ది.  మనిషి కూడా ఎప్పుడూ కదలిక లేకుండా నిశ్చలంగా ఉండిపోకూడ-దు. జీవి కదలిక ఉత్సవం లాంటిదనే చెప్పడ-మే ఈ సంక్రాంతి పండుగ చెప్పే రహస్యం.  ప్రస్తుతం మనుషుల జీవితాల్లో ఏదో ఒక ఆందోళన సాధారణం అయిపోయింది. జీవితంలో చెడు కానీ, మంచి కానీ చిన్న మార్పు వచ్చినా తట్టుకునే శక్తి ఉండటం లేదు. శారీరక, మానసిక రోగాల బారిన పడుతున్నా రు. మనసు, శరీరాల్లో కదలిక లేకుండా ఉండే
కన్నా , ఎప్పటికప్పుడు మార్పును తీసుకోగలగాలని ఈ పండుగ మనకు సందేశమిస్తుంది.

అనుబంధాల కాంతి

ఇళ్లల్లో తాతయ్యలు, బామ్మలు ‘పొద్దెక్కుతోంది.. స్నానం చేయి.. కొత్త బట్టలు వేసుకో’ అని  హడావిడి పెడుతుంటారు. అమ్మానాన్నలు, అక్కాబావ-లు, బాబాయి, పిన్ని… అందరూ ఒకదగ్గర చేరి.. ముచ్చట్లు పెడుతుంటారు. వాళ్ల జీవితాల్లో చిన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి బోలెడు కబుర్లు చెప్పుకుంటుంటారు. చిన్న పిల్లలంతా కొత్త బట్టలు వేసుకుని  అల్లరి చేస్తుంటారు. వంటింట్లో బంధువులు ముచ్చట్లలో మునిగి.. నోరూరించే వంటలు చేస్తుంటారు.  అందరూ కలవడం అనేదే గొప్ప ఆలోచన. ఇక అందరూ కలిసి సంతోషంగా గడిపితే.. అదే పండగ! అనుబంధాలకు సంక్రాంతి స్వచ్ఛమైన సంబురం.

హరిదాసులు

ముఖం మీద తిరునామాలు. కాళ్లకు గజ్జెలు. చేతిలో చిడతలు, నెత్తిమీద రాగితో చేసిన పాత్ర పెట్టుకొని సంక్రాంతికి హరిదాసులు తిరుగుతుంటారు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చి-పోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది.

వంటలు

సంక్రాంతి రోజు పాలు పొంగిస్తారు. వాటితో పొంగలి చేస్తారు. పరమాన్నం , పులిహోర, గారెలు… వంటలు చేసుకుంటారు. పిండివం-టల విషయానికి వస్తే అరిసెలు, బూరెలు, జంతికలు, సకినాలు చేసుకుంటారు. అలాగే లడ్డూలు, బూంది, మురుకులు, సేమియా పాయసం కూడా వం-డుకుంటారు. మన సంప్రదాయాలకు ప్రతీకలైన పండుగల్లో సంక్రాంతి  ముఖ్యమైనది. భోగభాగ్యాలతో, సిరిసంపదలను కురిపిస్తూ, కొత్తకాంతులను విరజిమ్ముతూ, కొత్త ధాన్యాలతో సంక్రాంతి లక్ష్మీ అందరికీ సంతోషం పంచాలన్నదే ఈ పండుగ ఇచ్చే మెసేజ్​.

Latest Updates