అమెరికాలో అగ్నికి ఆహుతైన పడవ.. 33 మంది ప్రయాణికులు గల్లంతు

అమెరికాలోని ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా… 33 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఉత్తర కాలిఫోర్నియా సమీపంలోని శాంతాక్రజ్ ఐలండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గల్లంతైన 33 మందీ  చనిపోయి ఉండవచ్చని అమెరికా తీర రక్షక దళం భావిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు.. నలుగురి మృతదేహాలను వెలికి తీసింది తీర గస్తీదళం. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Latest Updates