తమిళ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

సీనీ ఇండస్ట్రీలో ప‌లువురు ప్ర‌ముఖులు కరోనా బారిన ప‌డుతున్నారు. ఈ వైర‌స్ మ‌హ‌మ్మారి వ‌ల్ల ప‌లువురు ప్రముఖులు కన్నుమూయగా … మరి కొందరు క్షేమంగా కొలుకున్నారు. తాజాగా ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక ట్విట్టర్ ద్వారా తెలియ చేశారు. ఈరోజు “శరత్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలూ కనిపించలేదు కానీ ముందు జాగ్రత్తగా ఆయన మంచి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తా అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. డాక్ట‌ర్ల సలహా మేరకు 14 రోజులు ఇంట్లో ఉంటే సరిపోతుందని.. ఎవరూ దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేద‌ని ఆమె అన్నారు. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని ఆమె అన్నారు.

Latest Updates