చీరకట్టులో చక్కన్నమ్మ ఏం చేసినా అందమే (వీడియో)

ఏ పని చేయాలన్నా చీరకట్టు అడ్డంవస్తుందని చాలా మంది మహిళలు అనుకుంటారు. కానీ ఈష్నా కుట్టి అలా కాదు. చీరలో హూప్ డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

23ఏళ్ల ఈష్నా కుట్టి మంచి హూప్ డ్యాన్సర్.తాజాగా చీరకట్టులో నడుముకు రింగ్ తగిలించుకొని చేసిన హూప్ డ్యాన్స్ తో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జెండా పూల్ అనే పాటకు రింగ్ ధరించి పాటను అనుకరిస్తూ లయబద్దంగా ఆమె వేసిన డ్యాన్స్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈష్నాకుట్టి తల్లి జర్నలిస్ట్ చిత్రానారాయణ్. ఈష్నాకుట్టి డ్యాన్స్ చేస్తుండగా చిత్రానారాయణ్ వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హూప్ డ్యాన్స్‌లో నడుము తిరిగిన కుట్టి వీడియోలపై #SareeFlow అని హ్యాష్ ట్యాగ్స్ తో కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates