సరిలేరు నీకెవ్వరు..సందడి షురూ

మహేష్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రమోషన్‌ని కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే టీజర్‌‌ విడుదలై సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. డిసెంబర్‌‌ 2న మొదటి పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టారు. అక్కడి నుంచి ప్రతి సోమవారం ఒక్కో పాటనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేశారట. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్ లాంటి పాపులర్ ఆర్టిస్టులందరూ నటిస్తున్నారు. అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని పాటలు మరింత పెంచుతాయేమో చూడాలి.

Latest Updates