భయపడేవాడే బేరానికి వస్తాడు..

సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో మహేశ్‌బాబు మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక  హీరోయిన్ గా నటించగా, విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

మిలటరీలో పనిచేసే అజయ్ గా మహేష్ ని చూపిస్తూ టీజర్ మొదలవుతుంది. భయపడేవాడే బేరానికి వస్తాడు.. మన దగ్గర బేరాల్లేవు అంటూ మహేష్ చెప్పే డైలాగ్ బాగుంది. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడంటూ విజయశాంతి డైలాగ్.. టిజర్ చివరలో ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు కానీ ఈ సంక్రాంతికి మొగుడు వస్తున్నాడంటూ ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ తో 1.26 నిమిషాల నిడివి గల టీజర్‌ ముగుస్తుంది.ఈ సినిమా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Updates